Telangana: దక్షిణాదిలో ‘లిక్కర్ క్యాపిటల్’గా తెలంగాణ.. ఒక్కొక్కరు ఏడాదికి సగటున ఎంత ఖర్చు చేస్తున్నారంటే..!
- తలసరి మద్యం వినియోగంలో తెలంగాణ దక్షిణాదిలో అగ్రస్థానం
- ఒక్కొక్కరు ఏడాదికి సగటున రూ.11,351 మద్యం ఖర్చు
- మద్యం విక్రయాల ద్వారా తెలంగాణకు ఏటా రూ.36,000 కోట్లకు పైగా ఆదాయం
- పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగం అధికం
- ఆరోగ్య, సామాజిక సమస్యలపై నిపుణుల ఆందోళన
దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి ‘లిక్కర్ క్యాపిటల్’గా మారింది. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ తలసరి మద్యం వినియోగం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా ఉండగా, కర్ణాటక (4.25 లీటర్లు), తమిళనాడు (3.38 లీటర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏపీ 2.71 లీటర్లతో నాలుగో స్థానంలో ఉండగా, కేరళ 2.53 లీటర్లతో చివర్లో నిలిచింది.
తెలంగాణలో ముఖ్యంగా బీరు వినియోగం గత ఏడాది కాలంలో అనూహ్యంగా పెరిగింది. వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడవునా బీరు వినియోగం సాగుతోంది. ఒక్కొక్కరు ఏడాదికి సగటున రూ.11,351 మద్యం కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అదే సమయంలో ఏపీలో సగటు వ్యక్తి ఏడాదికి రూ.6,399 మాత్రమే ఖర్చు చేస్తున్నాడు.
ఈ భారీ మద్యం విక్రయాల వల్ల తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.36,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయితే, ఈ ఆదాయం వెనుక సామాజిక, ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పట్టణాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుందనే భావన ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగం అధికంగా ఉంది. పండుగలు, శుభకార్యాలు, సామాజిక వేడుకల్లో మద్యం భాగమైపోవడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.