Nara Lokesh: వంజంగి మేఘ సౌందర్యం అమేజింగ్: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్
- వంజంగి ప్రకృతి సౌందర్యంపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్
- ఓ నెటిజన్ చేసిన పోస్టును తన ఖాతాలో పంచుకున్న లోకేశ్
- అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వంజంగి
- శీతాకాలంలో మేఘాల అందాలు వీక్షించేందుకు పర్యాటకుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి ప్రకృతి సౌందర్యంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. వంజంగి అందాలను వర్ణిస్తూ ఓ నెటిజన్ చేసిన పోస్టును ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. "వంజంగి ఎప్పుడూ అబ్బురపరచడంలో విఫలం కాదు. మాయ చేసే మేఘాల పొరలు, బంగారు కాంతి, మాటల్లో వర్ణించలేని ప్రశాంతత.. ఇది ప్రకృతి అత్యద్భుతమైన రూపం" అని ఆ పోస్టులో ఉన్న వ్యాఖ్యలను లోకేశ్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలో వంజంగి అనే ఈ సుందరమైన కొండ ప్రాంతం ఉంది. ఎత్తయిన ఈ ప్రదేశంలో మబ్బులు చేతికి అందినంత దగ్గరగా ఉండటం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతుంది.
సూర్యోదయ సమయంలో కొండలపై తేలియాడే మబ్బుల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తెల్లవారుజామునే ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటారు. సాధారణంగానే పర్యాటకులను విశేషంగా ఆకర్షించే వంజంగికి, ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ పోస్టుతో మరింత ప్రచారం లభించినట్లయింది.