జగపతిబాబు రెండో కుమార్తె వివాహం.. క్రియేటివ్ వీడియోను షేర్ చేసిన జగ్గూభాయ్

  • తన ఇంట్లో జరిగిన శుభకార్యం గురించి ప్రకటించిన జగపతిబాబు
  • ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియో షేర్ చేసిన జగ్గూభాయ్
  • “ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్” అని క్యాప్షన్

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు తన కుటుంబంలో జరిగిన వేడుకను అభిమానులతో పంచుకున్నారు. తన రెండో కుమార్తె వివాహం ఘనంగా జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో వినూత్నంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను పూర్తిగా ఏఐ సాంకేతికతతో రూపొందించారు.


జగపతిబాబు తన వీడియోకు... “ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్” అనే క్యాప్షన్ పెట్టారు. పెళ్లికి సంబంధించిన అసలు ఫొటోలు, అల్లుడి వివరాలను బయటకు రానివ్వకుండా కేవలం క్రియేటివ్ వీడియో ద్వారా కుటుంబ శుభకార్యాన్ని వెల్లడించారు. వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి సాధారణంగా పెద్ద హడావుడితో జరుగుతుందని... కానీ, జగపతిబాబు సింపుల్ గా ఈ విషయాన్ని వెల్లడించారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.



More Telugu News