Chinmayi: నటుడు శివాజీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి

Chinmayi Responds Strongly to Actor Sivajis Comments
  • 'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
  • మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్ చిన్మయి
  • శివాజీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మండిపాటు

'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు చీరలు కట్టుకోవాలని, బట్టల విషయంలో హద్దులు దాటితే సమస్యలు ఎదురవుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని చిన్మయి తీవ్రంగా స్పందించారు.


“మహిళలందరూ చీరే కట్టుకోవాలా? అయితే మీరు కూడా జీన్స్, హుడీలు మానేసి ధోతి మాత్రమే కట్టుకోండి. భారత సంప్రదాయం గురించి మాట్లాడేవారు ముందుగా తామే పాటించాలి” అంటూ చిన్మయి ఘాటుగా ప్రశ్నించారు. అంతేకాదు, పెళ్లయితే కంకణం, మెట్టెలు కూడా ధరించాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.


ఒక మంచి సినిమాలో విలన్ పాత్ర పోషించిన శివాజీ, ఇప్పుడు పోకిరి భాషతో మాట్లాడుతున్నారని చిన్మయి విమర్శించారు. మహిళల డ్రెస్సింగ్‌ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు.


ఈ విషయంపై చిన్మయి చేసిన సోషల్ మీడియా పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మరోవైపు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు బట్టలు వేసుకునే తీరు కారణంగా ఇతరులు లోపల ఏమనుకుంటారో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే చిన్మయి తీవ్రంగా స్పందించారు.

Chinmayi
Singer Chinmayi
Actor Sivaji
Dandora Movie
Sivaji Comments
Dress Code Controversy
Telugu Cinema
Social Media Reaction
Chiranjeevi
Tollywood

More Telugu News