Seethakka: అదానీ, అంబానీల కోసమే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారు: సీతక్క

Seethakka slams center for abolishing NREGA for Adani Ambani
  • జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడంపై సీతక్క ఫైర్
  • గాంధీ పేరు తీసేసి ఆయనను మరోసారి హత్య చేశారన్న సీతక్క
  • పథకాన్ని కాపాడాలని అన్ని గ్రామాల్లో తీర్మానం చేస్తామని వెల్లడి
జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో వీబీ జీ రామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి సీతక్క ఈ అంశంపై మాట్లాడుతూ... ఉపాధి హామీ చట్టానికి కేంద్రం మహాత్మా గాంధీ పేరును తీసేసి, ఆయనను మరోసారి హత్య చేసిందని అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

అదానీ, అంబానీల మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారని సీతక్క మండిపడ్డారు. ఈ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ నెల 27 లేదా 28 తేదీలో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు, వలసలను అరికట్టేందుకు గత యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే... ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీకి ఉరి వేసిందని దుయ్యబట్టారు.
Seethakka
MGNREGA
NREGA
Telangana
Adani
Ambani
UPA
BJP
Employment Guarantee Scheme
Gandhi Bhavan

More Telugu News