Ather Energy: జనవరి 1 నుంచి పెరగనున్న ఏథర్ ఈవీ స్కూటర్ల ధరలు
- రూ. 3 వేల వరకు ధరలు పెరగున్నట్టు ప్రకటించిన ఏథర్
- మోడల్ ను బట్టి పెరగనున్న ధరలు
- ప్రస్తుతం ఎలక్ట్రానిక్ డిసెంబర్ స్కీమ్ ను అమలుచేస్తున్న ఏథర్
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకారం, జనవరి 1 నుంచి అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు పెంపు అమల్లోకి రానుంది.
ముడిసరుకు ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు పెరగడం, ఫారెక్స్ ప్రభావం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏథర్ వివరించింది. ప్రస్తుతం ఏథర్ 450 సిరీస్ పెర్ఫార్మెన్స్ స్కూటర్లు మరియు రిజ్తా ఫ్యామిలీ స్కూటర్లును మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1,14,546 నుంచి రూ.1,82,946 మధ్య ఉన్నాయి. ధరల పెంపు ఒక్కో మోడల్‌కు ఒక్కో విధంగా ఉండనుంది.
ఇక ప్రస్తుతం కంపెనీ ‘ఎలక్ట్రానిక్ డిసెంబర్’ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఇందులో ఎంపిక చేసిన నగరాల్లో ఏథర్ స్కూటర్ కొనుగోళ్లపై రూ.20,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.