సౌదీలో ఆ కార్మికుల‌కు ఇ-శాల‌రీ విధానం

  • డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల‌కు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి ఇ-శాల‌రీ విధానం త‌ప్ప‌నిస‌రి
  • ఈ మేర‌కు సౌదీ అరేబియా మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ ప్ర‌క‌ట‌న
  • అన్ని రకాల గృహ కార్మికుల‌కు ఇది వ‌ర్తింపు
గల్ఫ్‌ దేశం సౌదీ అరేబియా తాజా మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశంలో ప‌నిచేసే డొమెస్టిక్ వ‌ర్క‌ర్ల‌కు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి ఇ-శాల‌రీ విధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ మేర‌కు సౌదీ అరేబియా మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

అన్ని రకాల గృహ కార్మికుల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఉపాధి ప్ర‌క్రియ‌ల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డం, వేత‌న ర‌క్ష‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డం, పార‌ద‌ర్శ‌క‌త పెంచ‌డం వంటి చ‌ర్య‌ల్లో భాగంగా ఎల‌క్ట్రానిక్స్ మార్గాల ద్వారా జీతాలు పొంద‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు వెల్ల‌డించింది. 

ఒక‌వేళ కార్మికులు ఎల‌క్ట్రానికి చెల్లింపులు వ‌ద్దంటే మాత్రం వారి శాల‌రీల‌ను స‌రైన డాక్యుమెంటేష‌న్‌తో న‌గ‌దు లేదా చెక్కు రూపంలో చెల్లించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఇక‌, కొత్త చెల్లింపుల విధానంలో భాగంగా ఓన‌ర్లు న‌గ‌దు రూపంలో జీతాలు చెల్లించ‌డానికి బ‌దులుగా గుర్తింపు పొందిన బ్యాంకు లేదా డిజిట‌ల్ వాలెట్ల‌ను వినియోగించి న‌గ‌దు బ‌దిలీ చేయాల‌ని మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.   




More Telugu News