Canada Immigration: కెనడా కీలక నిర్ణయం.. స్టార్ట్-అప్ వీసా కార్యక్రమం నిలిపివేత
- దాని స్థానంలో తమ దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకం
- ఈ మేరకు 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త స్కీమ్ అంటూ ఐఆర్‌సీసీ ప్రకటన
- ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులు పూర్తిగా నిలిపివేత
కెనడా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తన స్టార్ట్-అప్ వీసా (SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఆ స్థానంలో, తమ దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుందని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) తెలిపింది.
స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఐఆర్‌సీసీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత ఎస్‌యూవీ వర్క్ పర్మిట్‌ను పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
అయితే, కొత్త పైలట్ ప్రాజెక్టు ప్రస్తుత స్టార్ట్-అప్ వీసా ప్రోగ్రామ్ కు ఎలా భిన్నంగా ఉంటుందో ఐఆర్‌సీసీ ఇంకా వెల్లడించలేదు. కానీ, కొత్త పథకం కెనడా దీర్ఘకాలిక ఇమ్మిగ్రేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.