Aravalli Hills: ఆరావళి పర్వతాలకు ముప్పు లేదు.. కేంద్ర ప్రభుత్వం

Aravalli Range Protection Commitment by Central Government
  • మైనింగ్ కోసం నిబంధనలు సడలించలేదని వెల్లడి
  • ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం వివరణ
  • 90 శాతం పర్వతాలు అలాగే ఉంటాయని స్పష్టీకరణ  
ఆరావళి పర్వతాల విషయంలో ప్రతిపక్షాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. తాజా నిబంధనల వల్ల పర్వతాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. నూతన నిబంధనలతో 90 శాతం పర్వతాలు సురక్షితంగా ఉంటాయని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీకి తావులేదని వివరించింది.

ఆరావళి పర్వతాల సరిహద్దులు లేదా నిర్వచనాన్ని మార్చడం ద్వారా మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం రహదారిని సుగమం చేస్తోందని వస్తున్న వార్తల్లో నిజంలేదని కేంద్ర పర్యావరణ శాఖ పేర్కొంది. నిర్వచనానికి సంబంధించిన సాంకేతిక మార్పులు కేవలం పరిపాలనాపరమైన స్పష్టత కోసమే తప్ప, భూములను మైనింగ్‌కు అప్పగించడానికి కాదని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలకు అనుగుణంగానే పర్వత ప్రాంతాల రక్షణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వివరించింది.

ఆరావళి శ్రేణులు ఢిల్లీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు రక్షణ కవచం లాంటివని, వాటిని కాపాడటమే తమ బాధ్యతని పేర్కొంది. పర్యావరణ సమతుల్యతను కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి పేరుతో పకృతిని ధ్వంసం చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం వెల్లడించింది. ఆరావళి పర్వతాల పరిరక్షణపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.
Aravalli Hills
Aravalli Range
Aravali Mountains
Mining
Environment Protection
Supreme Court
Illegal Mining
Central Government
Delhi

More Telugu News