మొన్న నిధి అగర్వాల్.. నేడు సమంత.. సేమ్ సీన్ రిపీట్..!
- మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్‌కు లులు మాల్‌లో చేదు అనుభవం
- ఇప్పుడు ఇదే తరహా ఘటన ఎదుర్కొన్న సామ్
- ఓ షోరూమ్ ఓపెనింగ్‌లో సమంతను చుట్టుముట్టిన ఫ్యాన్స్
- వ్యక్తిగత సెక్యూరిటీ సాయంతో అతికష్టం మీద అక్కడి నుంచి బయటపడ్డ వైనం
మొన్న హీరోయిన్ నిధి అగర్వాల్‌కు లులు మాల్‌లో ‘ది రాజా సాబ్’ సినిమా పాట విడుదల సందర్భంగా చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా అలాంటి అనుభవమే సమంతకూ ఎదురైంది. కార్యక్రమం ముగిశాక తిరిగి వెళుతున్న ఆమెను చూసేందుకు అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు. దాంతో తన వ్యక్తిగత సెక్యూరిటీ సాయంతో అతికష్టం మీద అక్కడి నుంచి ఆమె బయటపడ్డారు. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దాంతో అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..!
నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ ప్రాంతంలో సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి సామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే, షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమం ముగిసిన అనంతరం సమంత బయటకు వచ్చి తన కారు వద్దకు వెళుతుండగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆమెను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ప్రయత్నించారు.
దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి, ఆమె కారు వరకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. దీంతో వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అతికష్టం మీద సమంతను అభిమానుల గుంపు మధ్య నుంచి తప్పించి కారు ఎక్కించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.