నారా లోకేశ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఎంపీఎల్-4 పోటీలు... ప్రారంభించిన నారా బ్రహ్మణి

  • నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు
  • ప్రారంభోత్సవానికి విచ్చేసిన నారా బ్రహ్మణి
  • కాసేపు బ్యాటింగ్ చేసిన లోకేశ్ అర్ధాంగి
గత మూడు సీజన్లులగా క్రికెట్ ప్రేమికులను అలరించిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4 నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోని నారా లోకేశ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బ్రహ్మణి... అనంతరం మైదానంలోకి దిగి టోర్నీ ప్రారంభించారు. బ్యాట్ చేతపట్టి షాట్లు కొట్టారు. ఓపెనింగ్ మ్యాచ్ ను కొద్దిసేపు వీక్షించారు. 

ఈ కార్యక్రమానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు, టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్థార్థ్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను బ్రహ్మణి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 


More Telugu News

Nara Brahmani Nara Lokesh Mangalagiri Premier League MPL Season 4 Telugu Desam Party Sana Satish Babu Nikhil Siddhartha Andhra Pradesh Cricket NTR Statue