Revanth Reddy: నాంపల్లిలో కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy Attends Nampally Court in Hyderabad
  • గతంలో ఓయూ, తిరుమలగిరి, మఠంపల్లి పీఎస్‌లలో నమోదైన కేసులు
  • విచారణలో భాగంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన, పోలీసులపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తిరుమలగిరి, మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల విచారణలో భాగంగా ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.

ఈ మూడు కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, రాజకీయ కార్యక్రమాల సందర్భంలో నమోదైనవి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కేసులు నమోదయ్యాయి.

కోర్టులో న్యాయమూర్తి ఎదుట రేవంత్ రెడ్డి ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మూడు కేసుల్లోనూ ఈ ప్రక్రియ పూర్తయింది. ముఖ్యమంత్రి హాజరు కావడంతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా, సామాన్య ప్రజలను కోర్టు హాలు సమీపంలోకి అనుమతించలేదు.
Revanth Reddy
Telangana CM
Nampally Court
Election Code Violation
Osmania University
BRS Government

More Telugu News