Hapur stunt: యూపీలో హైవే బ్రిడ్జికి వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్
- ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిలోని యువకుడి విన్యాసం
- కింద వాహనాలు వేగంగా వెళుతుండగా పైన రైల్వే బ్రిడ్జిపై పులప్స్
- రైల్వే వంతెనపై వేలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై హాపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు కలిగించే విన్యాసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముదురు రంగు ప్యాంటు, నల్లటి చొక్కా ధరించిన వ్యక్తి రద్దీగా ఉండే హైవే మీదుగా వెళ్ళలే రైల్వే వంతెనపై పులప్స్ చేస్తూ విన్యాసాలు చేశాడు.
కింద జాతీయ రహదారిపై వాహనాలు వేగంగా వెళుతుండగా, పైన ఉన్న రైల్వే వంతెనకు వేలాడుతూ కనిపించాడు. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని పిల్ఖువా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ యువకుడి చర్యను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేసే వారి వల్ల వారితో పాటు పక్కవారి ప్రాణాలకు కూడా ముప్పని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం బాగ్పట్ సమీపంలోని జాతీయ రహదారి-9పై వేగంగా వెళుతున్న ఎస్‌యూవీపై ప్రమాదకరమైన విన్యాసం చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతను రెండు తలుపులు తెరిచి స్కార్పియో నడుపుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత స్టీరింగ్ వీల్‌ను వదిలి బానెట్ మీద నిలబడ్డాడు. పక్కనే మరో వాహనంలో వెళుతున్న వారు ఈ వీడియోను తీయడంతో వెలుగులోకి వచ్చింది.