Aryan Khan: తన తొలి అవార్డును తల్లి గౌరీ ఖాన్‌కు అంకితమిచ్చిన ఆర్యన్ ఖాన్

Aryan Khan Dedicates First Award to Mother Gauri Khan
  • ఎన్డీటీవీ అవార్డు అందుకున్న ఆర్యన్ ఖాన్
  • ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా ఘనత
  • ఆర్యన్ విజయం చూసి భావోద్వేగానికి గురైన అమమ్మ
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తన తొలి అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన 'ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్' కార్యక్రమంలో 'బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన తన అవార్డును తల్లి గౌరీ ఖాన్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ మాట్లాడుతూ, "తొలిసారి దర్శకత్వం వహించిన నన్ను నమ్మిన నెట్‌ఫ్లిక్స్‌కు, నటీనటులకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఇది నా మొదటి అవార్డు. మా నాన్నలాగే నాకూ అవార్డులంటే చాలా ఇష్టం. కానీ ఈ అవార్డు ఆయన కోసం కాదు, మా అమ్మ కోసం. ఎందుకంటే, త్వరగా పడుకోవాలని, ఇతరులను ఎగతాళి చేయొద్దని, అసభ్య పదజాలం వాడొద్దని అమ్మ ఎప్పుడూ చెబుతుంది. సరిగ్గా నేను చేసిన ఆ పనులకే ఈ రోజు ఎన్డీటీవీ నాకు ఈ అవార్డు ఇచ్చింది. మా అమ్మను సంతోషపెట్టినందుకు ఎన్డీటీవీకి థ్యాంక్స్. ఈ రోజు ఇంటికి వెళ్లాక నాకు తిట్లు తక్కువ పడతాయని ఆశిస్తున్నా" అని చమత్కరించారు.

ఇదే కార్యక్రమంలో ఆర్యన్ అమ్మమ్మ సవితా చిబ్బర్ మనవడి విజయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. "నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆశీస్సులు వాడికి ఎప్పుడూ ఉంటాయి. దేశమంతా నా మనవడి ప్రతిభను గుర్తించడం గర్వంగా ఉంది" అని ఆమె ఆనందంతో అన్నారు. నానమ్మ మాటలకు స్పందించిన ఆర్యన్, తన తదుపరి అవార్డు కచ్చితంగా ఆమెకే అంకితం ఇస్తానని మాటిచ్చారు. ఆ తర్వాత వేదిక దిగివచ్చి నానమ్మను ఆలింగనం చేసుకోవడం అక్కడున్న వారిని కదిలించింది.

ఆర్యన్ ఖాన్, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. లక్ష్య, బాబీ డియోల్, సహెర్ బంబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ఆయనే క్రియేటర్, రైటర్, షోరన్నర్‌గా వ్యవహరించారు.
Aryan Khan
Gauri Khan
NDTV Indian of the Year
The Railway Men
Bollywood
Debut Director Award
Savita Chibber
Netflix
Lakshya
Bobby Deol

More Telugu News