Odisha Home Guard: ఒడిశాలో హోంగార్డు ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ల క్యూ.. నిరుద్యోగంపై రాజకీయ దుమారం

Odisha Home Guard Jobs See Postgraduates Queue Sparks Unemployment Debate
  • ఒడిశాలో 187 హోంగార్డు పోస్టులకు భారీ పోటీ
  • పరీక్షకు హాజరైన వారిలో ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు
  • రాష్ట్రంలో నిరుద్యోగంపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన తృణమూల్
  • రోజుకు రూ.639 జీతం ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ల దరఖాస్తు
ఒడిశాలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కేవలం 187 హోంగార్డు పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ నిర్వహించిన రాత పరీక్షకు ఏకంగా 8 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆశ్చర్యకరంగా, వీరిలో ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు పూర్తిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

వివరాల్లోకి వెళితే.. ఒడిశా పోలీస్ శాఖ మూడు రోజుల క్రితం, డిసెంబర్ 16న సంబల్పుర్‌లో హోంగార్డు పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఊహించని సంఖ్యలో తరలిరావడంతో వారిని అదుపు చేయడం అధికారులకు సవాలుగా మారింది. దీంతో ప్రత్యేక బలగాలను మోహరించడమే కాకుండా, డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ వ్యంగ్యంగా స్పందించింది. "రోజుకు కేవలం రూ.639 జీతం వచ్చే ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. చేతిలో డిగ్రీలు ఉన్నా కొలువులు లేని దుస్థితి ఇది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకొనే బీజేపీ ప్రభుత్వం పనితీరుకు ఇదే నిదర్శనం" అని తమ 'ఎక్స్' ఖాతాలో విమర్శించింది. 
Odisha Home Guard
Odisha
Home Guard Jobs
Unemployment
Postgraduates
TMC
BJP Government
Sambalpur
Job Crisis

More Telugu News