Ranveer Singh: ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’... ఓటీటీలో ఆల్ టైమ్ రికార్డు!
- రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' ఓటీటీ హక్కులపై భారీ డీల్
- దాదాపు రూ. 285 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్
- ఈ విషయంలో 'పుష్ప 2' రికార్డును అధిగమించిన బాలీవుడ్ చిత్రం
- ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' థియేటర్లలో రికార్డులు సృష్టిస్తూనే, ఓటీటీ డీల్‌లోనూ కొత్త సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ డీల్ విలువ ఏకంగా రూ. 285 కోట్లుగా ఉంది. ఇది ఇటీవలే 'పుష్ప 2' సాధించిన రూ. 275 కోట్ల ఓటీటీ డీల్‌ను అధిగమించడం గమనార్హం.
'ఉరీ' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, రూ. 1000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ హక్కులకు భారీ పోటీ ఏర్పడింది. నిబంధనల ప్రకారం, థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత, అంటే 2026 జనవరి 30 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో 'ధురంధర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
అయితే, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండటంతో నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న రూ. 285 కోట్ల ఒప్పందం కేవలం మొదటి భాగానికా లేక రెండు భాగాలకు కలిపా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇక 'ధురంధర్: రివెంజ్' పేరుతో రానున్న రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది.