Pawan Kalyan: ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ సమావేశాలు

Pawan Kalyan Holds One on One Meetings with 9 MLAs Today
  • జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశాలు
  • నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యలపై ప్రధానంగా చర్చ
  • ఈ రోజు 9 మంది శాసనసభ్యులతో ముఖాముఖి భేటీలు
  • మండలి బుద్ధ ప్రసాద్‌తో మొదలైన సమావేశాల పరంపర
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. శుక్రవారం నుంచి ఆయన పార్టీ శాసనసభ్యులతో వన్ టూ వన్ (ముఖాముఖి) భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశాల పరంపర మండలి బుద్ధప్రసాద్‌తో మొదలైంది.

ఈ సమీక్షల్లో భాగంగా, ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా, నియోజకవర్గాల్లో ఇంకా పరిష్కారం కాని సమస్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తారు.

ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మండలి బుద్ధ ప్రసాద్ అనంతరం దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, సుందరపు విజయ్ కుమార్ లతో ఆయన ముఖాముఖి భేటీ అవుతారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
MLA Meeting
Mandali Buddha Prasad
Deva Varaprasad
Lokam Naga Madhavi
Giddi Satyanarayana
AP Politics
Legislative Assembly

More Telugu News