తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకున్న జార్ఖండ్.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు
- ఫైనల్లో హర్యానాపై 69 పరుగుల తేడాతో ఘన విజయం
- కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీతో విధ్వంసం
- టీ20 ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జార్ఖండ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (101) అద్భుత సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హర్యానాను 69 పరుగుల తేడాతో చిత్తు చేసి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్, టీ20 టోర్నమెంట్ ఫైనల్ చరిత్రలోనే అత్యధికంగా 262/3 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కెప్టెన్ ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్రతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన కిషన్.. మొత్తం 10 సిక్సర్లు, 6 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. అతనికి కుశాగ్ర (38 బంతుల్లో 81) అద్భుత సహకారం అందించాడు. ఈ సెంచరీతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో శతకం బాదిన తొలి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. చివర్లో అనుకుల్ రాయ్ (40), రాబిన్ మింజ్ (31) మెరవడంతో జార్ఖండ్ భారీ స్కోరు సాధించింది.
263 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హర్యానాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. వికాశ్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే కెప్టెన్ అంకిత్ కుమార్, ఆశిష్ సివాచ్ డకౌట్‌గా వెనుదిరిగారు. యశ్‌వర్ధన్ దలాల్ (22 బంతుల్లో 53) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆశలు రేపినా, అది ఎక్కువసేపు నిలవలేదు. కీలక సమయంలో అనుకుల్ రాయ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా జార్ఖండ్ వైపు తిప్పేశాడు. ఆ తర్వాత హర్యానా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 193 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో జార్ఖండ్ తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ ప్రతిష్ఠాత్మక దేశవాళీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.