సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉపసర్పంచ్ అయ్యాడు

  • సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆసక్తికరం
  • సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించినప్పటికీ అనుకూలించని రిజర్వేషన్ అంశం
  • వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఉపసర్పంచ్ అయిన ప్రవీణ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని వార్డు మెంబర్‌గా గెలుపొంది, ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు.

అతని తల్లిదండ్రులు గత 18 సంవత్సరాలుగా గ్రామంలో వివిధ పదవుల్లో కొనసాగారు. వారి అడుగుజాడల్లో నడవాలని భావించిన ప్రవీణ్ కుమార్, తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వార్డు మెంబర్‌గా పోటీ చేశాడు. వాస్తవానికి అతను సర్పంచ్‌గా పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో తన అనుచరుడిని సర్పంచ్‌గా గెలిపించాడు. ప్రవీణ్ వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నాడు.


More Telugu News