టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఇంట విషాదం
- రామ్మోహన్ రావు మాతృమూర్తి కన్నుమూత
- 99 ఏళ్ల వయసులో కన్నుమూసిన వెంకట నరసమ్మ
- కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో నేడు అంత్యక్రియలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి వెంకట నరసమ్మ (99) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంకట నరసమ్మ మృతి వార్త తెలియగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కంభంపాటి నివాసానికి చేరుకుని తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలను కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వారి స్వగ్రామమైన పెద్ద అవుటుపల్లిలో కాసేపట్లో నిర్వహించనున్నారు.