'నమస్తే ఇండియా'.. మీ అభిమానానికి ధన్యవాదాలు: మెస్సీ

  • భారత పర్యటన ముగించుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
  • 'నమస్తే ఇండియా' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పోస్ట్
  • భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఆశాభావం
  • పర్యటనలో అభిమానులు చూపిన ఆదరణకు కృతజ్ఞతలు
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచకప్ విజేత లియోనెల్ మెస్సీ తన భారత పర్యటనను ముగించుకున్నాడు. ఈ సందర్భంగా భారతీయుల ఆదరణకు ముగ్ధుడైన మెస్సీ, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశాడు. "నమస్తే ఇండియా!" అంటూ తన సందేశాన్ని ప్రారంభించిన ఆయ‌న‌, తన పర్యటన అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు.

భారత్‌లోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో పర్యటించినట్లు మెస్సీ తెలిపాడు. "నా పర్యటనలో భాగంగా మీరు చూపిన ప్రేమాభిమానాలకు, గొప్ప ఆతిథ్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. భవిష్యత్తులో భారత ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు మెస్సీ పేర్కొన్నాడు. 

ఇక‌, ఈ నెల 13న భార‌త్‌కు వ‌చ్చిన మెస్సీ  నిన్న గుజ‌రాత్‌లోని వ‌న‌తార సంద‌ర్శ‌న‌తో త‌న ప‌ర్య‌ట‌న‌ను ముగించాడు.


More Telugu News