ఐపీఎల్ వేలం: రూ.30 లక్షలతో వచ్చి రూ.14.20 కోట్లతో జాక్‌పాట్ కొట్టిన యూపీ ఆల్‌రౌండర్

  • ప్రశాంత్ వీర్ కోసం పోటీపడిన లక్నో, ముంబై, రాజస్థాన్
  • కార్తీక్ శర్మను కూడా రూ.14.20 కోట్లకు దక్కించుకున్న చెన్నై
  • అదరగొట్టిన అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.20 కోట్లకు సొంతం చేసుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ జాక్‌పాట్ కొట్టాడు. అతడి కోసం లక్నో, ముంబై, రాజస్థాన్ కూడా పోటీ పడ్డాయి.

కార్తీక్ శర్మను కూడా చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య ధరకు దక్కించుకుంది. కోల్‌కతా, హైదరాబాద్ జట్లు కార్తీక్ కోసం పోటీ పడగా, చెన్నై రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. మరో అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ దార్‌ను ఢిల్లీ రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.7.2 కోట్లకు సొంతం చేసుకుంది.

ప్రశాంత్ సోలంకి, కార్తిక్ త్యాగిలను కేకేఆర్ జట్టు రూ.30 లక్షల చొప్పున, సుశాంత్ మిశ్రాను రాజస్థాన్ రూ.90 లక్షలకు, నమన్ తివారిని లక్నో రూ.1 కోటికి సొంతం చేసుకున్నాయి. అశోక్ శర్మను గుజరాత్ రూ.90 లక్షలకు దక్కించుకుంది. అతడి కోసం కేకేఆర్, రాజస్థాన్, గుజరాత్ పోటీ పడ్డాయి.


More Telugu News