సిడ్నీ కాల్పుల ఘటనకు హైదరాబాద్ లింక్... నిందితుడి వద్ద భారత పాస్‌పోర్ట్!

  • సిడ్నీ కాల్పుల నిందితుడు సాజిద్‌కు హైదరాబాద్‌తో సంబంధం
  • హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్టు గుర్తింపు
  • 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు పయనం
  • కాల్పుల్లో మరో నిందితుడిగా ఆస్ట్రేలియాలో పుట్టిన కొడుకు
  • సాజిద్ కుటుంబ సభ్యుల వివరాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరా
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నట్టు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. ఈ పాస్‌పోర్ట్‌ను హైదరాబాద్ నుంచి పొందినట్టు వారు భారత ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈ పరిణామంతో ఈ ఘటనకు హైదరాబాద్‌తో సంబంధం ఉన్నట్టు తేలింది.

వివరాల్లోకి వెళ్తే, సాజిద్ అక్రమ్ 1998లో స్టూడెంట్ వీసాపై హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే ఒక విదేశీయురాలిని వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. గడిచిన 25 ఏళ్లలో అతడు కేవలం పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. చివరిసారిగా 2022లో నగరానికి వచ్చి వెళ్లినట్టు తెలిసింది.

కొద్ది రోజుల క్రితం సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ వద్ద సాజిద్, అతని కుమారుడు నవీద్ జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాజిద్ కుమారుడు నవీద్ కూడా నిందితుడిగా ఉన్నాడు. అయితే, నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు.

ఆస్ట్రేలియా అధికారుల నుంచి సమాచారం అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్‌లో సాజిద్ కుటుంబ సభ్యులు, బంధువుల వివరాల కోసం ఆరా తీస్తున్నాయి. వారి నేపథ్యంపై దర్యాప్తు ప్రారంభించాయి.


More Telugu News