ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ప్రయోగించిన టర్కీ డ్రోన్.. ఢిల్లీలో ప్రదర్శన

  • పాక్ ప్రయోగించిన డ్రోన్‌లను నాడు విజయవంతంగా కూల్చేసిన భారత సైన్యం
  • ఓ కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన ఆర్మీ చీఫ్ జనరల్ 
  • పంజాబ్‌లోని జలంధర్ లక్ష్యంగా లాహోర్ నుంచి ప్రయోగించిన డ్రోన్ 
ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనిక స్థావరాలు, పౌర స్థావరాలపై పాకిస్థాన్ వందలాది డ్రోన్‌లను ప్రయోగించిన విషయం విదితమే. ఈ డ్రోన్‌లను భారత సైన్యం సమర్థంగా నేలకూల్చింది. ప్రస్తుతం అందులో ఒక డ్రోన్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచారు.

టర్కీ తయారు చేసిన డ్రోన్‌లను పాకిస్థాన్ ప్రయోగించగా, భారత సైన్యం వాటిని మధ్యలోనే కూల్చివేసింది. ఈ క్రమంలో ఒక డ్రోన్ శకలాలతో భారత సైన్యం దానిని పునర్నిర్మించింది. విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు.

ఈ డ్రోన్‌ను పంజాబ్‌లోని జలంధర్‌ను లక్ష్యంగా చేసుకుని లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయోగించినట్లు అధికారులు వెల్లడించారు. 10 కిలోల పేలుడు పదార్థాలతో 2000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న దానిని మే 10న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసింది. దీని రెక్కల పొడవు దాదాపు రెండు మీటర్లు ఉంది. 170 సీసీ ఇంజిన్లతో ఈ డ్రోన్లు పనిచేస్తాయి.


More Telugu News