దివాలా తీసిన అమెరికా దిగ్గజ సంస్థ
- రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ‘రూంబా’ తయారీ సంస్థ ఐరోబోట్ దివాళా
- చైనాకు చెందిన ప్రధాన సప్లయర్ పిసియా చేతికి కంపెనీ యాజమాన్యం
- చైనా కంపెనీల పోటీ, అమెజాన్‌తో ఒప్పందం రద్దు కంపెనీ దివాలాకు ప్రధాన కారణాలు
- ప్రైవేట్ కంపెనీగా ఐరోబోట్ కొనసాగింపు
- కస్టమర్ సేవలకు అంతరాయం ఉండదన్న సీఈఓ
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటింటినీ పలకరించిన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ‘రూంబా’కు కష్టకాలం వచ్చింది. దీనిని తయారుచేసే ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థ ఐరోబోట్ (iRobot), 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దివాలా తీసినట్లు ప్రకటించింది. డెలావేర్ న్యాయస్థానంలో ‘చాప్టర్ 11’ కింద దివాలా రక్షణ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పునర్‌వ్యవస్థీకరణ ఒప్పందంలో భాగంగా, కంపెనీ తన ప్రధాన రుణదాత, పరికరాల సరఫరాదారు అయిన చైనాకు చెందిన షెన్‌జెన్ పిసియా రోబోటిక్స్ (Shenzhen PICEA Robotics) చేతికి వెళ్లనుంది.
ఈ ఒప్పందం ప్రకారం, ఐరోబోట్‌కు పిసియా సంస్థ ఇచ్చిన సుమారు 264 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసి, పూర్తి యాజమాన్యాన్ని స్వీకరించనుంది. ఈ మార్పుతో ఐరోబోట్ ఒక ప్రైవేట్ కంపెనీగా మారుతుందని, దాని సాధారణ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగిస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, తమ కస్టమర్లకు అందిస్తున్న సేవలు, యాప్ ఫంక్షనాలిటీ, సరఫరాదారులతో సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని, ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.
1990లో ముగ్గురు ఎంఐటీ (MIT) రోబోటిక్స్ నిపుణులు స్థాపించిన ఐరోబోట్, 2002లో రూంబాను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు 50 మిలియన్లకు పైగా రోబోటిక్ క్లీనర్లను విక్రయించింది. కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ విలువ రికార్డు స్థాయిలో 3.56 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, ఆ తర్వాత చైనాకు చెందిన ఎకోవాక్స్ వంటి కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ, తక్కువ ధరలకే ఉత్పత్తులు లభించడం, సరఫరా గొలుసులో సమస్యలు, వియత్నాం నుంచి దిగుమతులపై 46 శాతం సుంకాలు వంటి కారణాలతో కంపెనీ ఆర్థికంగా కుదేలైంది.
ఈ పరిస్థితులకు తోడు, 2024 జనవరిలో అమెజాన్‌తో కుదరాల్సిన 1.7 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందం యూరోపియన్ రెగ్యులేటర్ల అభ్యంతరాలతో రద్దు కావడం ఐరోబోట్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఈ ఒప్పందం విఫలమవడంతో కంపెనీ 31 శాతం ఉద్యోగులను తొలగించగా, సీఈవో కోలిన్ యాంగిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఐదేళ్లలో కంపెనీ స్టాక్ విలువ 90 శాతం పడిపోయింది.
పిసియా యాజమాన్యంలో ఐరోబోట్ తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని కంపెనీ సీఈవో గ్యారీ కోహెన్ తెలిపారు. "ఈ ఒప్పందంతో కంపెనీ దీర్ఘకాలిక భవిష్యత్తు సురక్షితమైంది. స్మార్ట్ హోమ్ రోబోటిక్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతాం" అని ఆయన వివరించారు. ఈ పరిణామం అమెరికన్ టెక్ పరిశ్రమపై చైనా కంపెనీల పోటీ, వాణిజ్య సుంకాల ప్రభావాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది.