మళ్లీ దూసుకుపోతున్న బంగారం ధరలు... 10 గ్రాములు ఎంతంటే...!
- హైదరాబాద్‌లో రూ.1.37 లక్షలు దాటిన తులం బంగారం
- 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరిక
- కిలో వెండి ధర రూ.1.96 లక్షలు దాటింది
- అంతర్జాతీయ మార్కెట్, డాలర్ బలహీనతే కారణం
- కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడుల ప్రభావం
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం నాటికి రూ.1,37,430కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,25,850 వద్ద నిలిచింది.
బంగారం బాటలోనే వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కిలో వెండి ధర రూ.1,96,948కి ఎగబాకింది. దేశీయంగా ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,340 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి 63 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది.
అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.