'ప్రేమలు' బ్యూటీతో సూర్య సినిమా.. షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన టీమ్

Suriya Movie with Premalu Beauty Shooting Completed
  • సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో సినిమా
  • అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదంటున్న సినీ వర్గాలు
  • హీరోయిన్‌గా ప్రేమలు ఫేమ్ మమితా బైజు  
  • 2026 వేసవిలో సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. సూర్య 46వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

మలయాళంలో ‘ప్రేమలు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘సూరారై పోట్రు’ తర్వాత సూర్యతో మళ్లీ పనిచేస్తున్నానని, ఆ సినిమా ఆల్బమ్ ఎంత స్పెషల్‌గా నిలిచిందో, ఈ సినిమా ఆల్బమ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందని జీవీ ప్రకాశ్ గతంలోనే ధీమా వ్యక్తం చేశారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రాన్ని 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
Go Back to Shorts
Suriya
Suriya 46
Venky Atluri
Mamitha Baiju
GV Prakash Kumar
Sitara Entertainments
Tollywood
Kollywood
Ravina Tandon
Radhika Sarathkumar

More Telugu News