Bigg Boss Tamil: తమిళ బిగ్‌బాస్‌లో దుమారం.. డార్క్ రూమ్‌లో కంటెస్టెంట్ల ముద్దుల రచ్చ!

Bigg Boss Tamil  Contestants Kissing Scandal in Dark Room
  • తమిళ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల ముద్దుల వివాదం
  • డార్క్ రూమ్‌లో గంటపాటు ఏకాంతంగా పార్వతి, కమ్రుద్దీన్
  • మైక్‌లో వినిపించిన శబ్దాలతో వెలుగులోకి వచ్చిన ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ఇది కుటుంబంతో కలిసి చూసే షో అంటూ నెటిజన్ల ఆగ్రహం
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ మరోమారు వివాదంలో చిక్కుకుంది. తమిళ బిగ్‌బాస్‌ తాజా సీజన్‌లో కంటెస్టెంట్లు హద్దులు మీరి ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. హౌస్‌మేట్స్ అయిన పార్వతి, కమ్రుద్దీన్ డార్క్ రూమ్‌లో ముద్దుల్లో మునిగి తేలడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, షోలో భాగంగా వీరిద్దరూ ఓ డార్క్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ సుమారు గంటపాటు ఏకాంతంగా గడిపారు. ఈ సమయంలో వారు ముద్దులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కెమెరాల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా నమోదు కాకపోయినా, వారి మైకుల్లో ముద్దుల శబ్దాలు స్పష్టంగా వినిపించాయని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సీజన్ ప్రారంభం నుంచే పార్వతి, కమ్రుద్దీన్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే, కుటుంబమంతా కలిసి చూసే షోలో ఇలాంటి అసభ్యకరమైన పనులకు పాల్పడటం సరికాదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో నిర్వాహకులపై, కంటెస్టెంట్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. గంట తర్వాత బిగ్‌బాస్ ఆదేశాలతో వారు డార్క్ రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. 
Bigg Boss Tamil
Parvati
Kamruddin
Tamil Bigg Boss controversy
Bigg Boss contestants kissing
Dark room controversy
Reality show controversy
Tamil reality show
Bigg Boss Tamil season
Kissing scandal

More Telugu News