హైదరాబాద్ వచ్చి తెలుగువారిని కలవడం సంతోషంగా ఉంది: మెస్సీ

  • తెలుగు ప్రజలు చూపిన అభిమానం తనకు శక్తినిచ్చిందన్న మెస్సీ
  • ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి, మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్
  • అపర్ణ మెస్సీ టీమ్‌పై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం
హైదరాబాద్ నగరానికి వచ్చి తెలుగు ప్రజలను కలవడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ అన్నాడు. తెలుగు ప్రజలు చూపిన అభిమానం తనకు ఎంతో శక్తిని ఇచ్చిందని పేర్కొన్నాడు.

మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మెస్సీ అపర్ణ మెస్సీ జట్టు తరఫున, రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున ఆడారు. ఈ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్ జట్టు 4-2 గోల్స్‌ తేడాతో అపర్ణ మెస్సీ జట్టుపై విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం సింగరేణి ఆర్ఆర్ జట్టుకు మెస్సీ ట్రోఫీని అందించగా, అపర్ణ మెస్సీ జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు మెస్సీ పేరుతో ఉన్న జెర్సీని లియోనల్ మెస్సీ అందజేశారు.


More Telugu News