'ధురంధర్' సినిమాపై రాజకీయ దుమారం... ప్రభుత్వ ప్రచార చిత్రమంటూ విపక్షాల ఫైర్
- ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' చిత్రంపై విమర్శలు
- ఇది ప్రభుత్వ ప్రచార చిత్రమంటూ విపక్షాల ఆరోపణలు
- సినిమాను సమర్థించిన బీజేపీ... ఇది ఉగ్రవాదంపై తీసిన చిత్రమన్న నేతలు
- పలు గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలపై నిషేధం విధించినట్లు సమాచారం
బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'ధురంధర్' దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రభుత్వ ప్రచారాన్ని ప్రోత్సహిస్తోందని పలు విపక్షాలు ఆరోపిస్తుండగా, ఇది కేవలం ఉగ్రవాదాన్ని చూపే చిత్రమని, దీని నిర్మాణంలో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.
డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో కాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల నేపథ్యంలో సాగే ఇంటెలిజెన్స్ ఆపరేషన్లను చూపించారు. సినిమా కథనం, మేకింగ్ పరంగా కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు అతి జాతీయవాదాన్ని, హింసను ఎక్కువగా చూపించారని విమర్శిస్తున్నారు. కంటెంట్ కారణంగా పలు గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలను నిలిపివేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ వివాదంపై ఐఏఎన్‌ఎస్‌తో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా మాట్లాడుతూ, "ప్రతి విషయాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదు. 'ధురంధర్' వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా. సృజనాత్మకతకు మతం రంగు పులమడం మంచి పద్ధతి కాదు" అని అన్నారు. బీజేపీ ఎంపీ భీమ్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "సినిమాలో ఉగ్రవాదాన్ని చూపించారు. ఆ ఉగ్రవాదులు ఇస్లాం మతానికి చెందినవారైతే, దానికి చిత్ర నిర్మాతలు ఎలా బాధ్యులవుతారు?" అని ఆయన ప్రశ్నించారు.
అయితే, విపక్షాలు మాత్రం భిన్నంగా స్పందించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి అమీక్ జమేయి మాట్లాడుతూ, "ఈ సినిమా ప్రభుత్వ ప్రచార యంత్రాంగంలో భాగమైంది. ప్రభుత్వ ప్రభావం లేకుండా స్వతంత్రంగా దీనిని తీసి ఉంటే బాగుండేది" అని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ స్పందిస్తూ, "అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ సినిమాను నిషేధించిన నేపథ్యంలో, ఇందులో అభ్యంతరకర కంటెంట్ ఏమైనా ఉందేమో పరిశీలించాలి" అని అభిప్రాయపడ్డారు.