రెడ్ బుక్ పేరు వింటేనే కొడాలి నానికి వణుకు: మంత్రి వాసంశెట్టి

  • కొడాలి నానిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు విమర్శలు
  • జగన్‌ను మెప్పించేందుకే గతంలో తమ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాట
  • విశాఖను గత ప్రభుత్వం గంజాయి హబ్‌గా మార్చిందని ఆరోపణ
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'రెడ్ బుక్' పేరు వింటేనే కొడాలి నాని గజగజ వణికిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. గతంలో జగన్‌ను సంతోషపెట్టేందుకు తమ పార్టీ నేతలను కొడాలి నాని నోటికి వచ్చినట్లు దూషించారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం రెడ్ బుక్ పేరు చెప్పగానే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, దీనిపై వైసీపీ నేతలు చేస్తున్న సంతకాల సేకరణ ఒక నాటకమని మంత్రి విమర్శించారు. 2024 ఎన్నికల్లో పార్టీ కేవలం 11 సీట్లకే ఎందుకు పరిమితమైందో తెలుసుకునేందుకు సంతకాల సేకరణ చేస్తే బాగుంటుందని హితవు పలికారు.

గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నాన్ని గంజాయికి హబ్‌గా మార్చేసిందని వాసంశెట్టి ఆరోపించారు. 


More Telugu News