ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
- హెలికాప్టర్ ద్వారా నిర్మాణ పనుల పురోగతి పరిశీలన
- భోగాపురం ఎయిర్‌పోర్ట్, జాతీయ రహదారి పనులపై ఆరా
- విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టులపై అధికారులతో చర్చ
విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రాయ్‌పూర్-విశాఖ జాతీయ రహదారి, తీరప్రాంత రోడ్లు, పోర్టులు, ఐటీ కంపెనీల నిర్మాణాల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచే ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా కనెక్టివిటీ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని, అభివృద్ధిలో కొత్త శకం ప్రారంభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి, వారికి పలు సూచనలు చేసినట్లు సమాచారం.