తండ్రి అయిన నటుడు తిరువీర్.. 'నాయినొచ్చిండు' అంటూ పోస్ట్

  • గతేడాది కల్పనను వివాహమాడిన తిరువీర్  
  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య 
  • ఫొటో షేర్ చేసిన హీరో తిరువీర్ 
టాలీవుడ్ యువ నటుడు తిరువీర్ తండ్రి అయ్యారు. ఆయన భార్య కల్పన ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని తిరువీర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కొడుకు చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ, దానికి "నాయినొచ్చిండు" అనే క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత సంవత్సరమే కల్పనను తిరువీర్ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

విలక్షణమైన నటనతో గుర్తింపు పొందిన తిరువీర్.. ‘మసూద’ చిత్రంతో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతకుముందు ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తో కలిసి ‘ఓ సుకుమారి’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


More Telugu News