Manchu Manoj: హైదరాబాద్‌లో లేక్ షోర్ మాల్‌లో హీరో మంచు మనోజ్ సందడి
- హైదరాబాద్ వై జంక్షన్‌లో లేక్ షోర్ మాల్ ప్రారంభం
- ముఖ్య అతిథిగా హాజరైన హీరో మంచు మనోజ్
- నిర్వాహకులు ప్రణవ్ పూరి, అశ్విన్ పూరిలకు అభినందనలు
- నగరానికి ఇది వరల్డ్ క్లాస్ లైఫ్‌స్టైల్ డెస్టినేషన్ అన్న మనోజ్
హైదరాబాద్‌లో సరికొత్త లైఫ్‌స్టైల్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని వై జంక్షన్‌లో అత్యంత విశాలంగా, విలాసవంతంగా నిర్మించిన ‘లేక్ షోర్ మాల్’ను సినీ నటుడు మంచు మనోజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, తన మిత్రులైన ప్రణవ్ పూరి, అశ్విన్ పూరి ఇలాంటి ఒక అద్భుతమైన మాల్‌ను నగరానికి అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ రిటైల్, లైఫ్‌స్టైల్ రంగంలో ఈ మాల్ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరల్డ్ క్లాస్ షాపింగ్ అనుభూతిని అందించాలనే వారి విజన్‌ను మనోజ్ అభినందించారు.
నిర్వాహకులు మాట్లాడుతూ, లేక్ షోర్ మాల్ నగర ప్రజలకు ఒక కొత్త షాపింగ్, వినోద అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ఈ మాల్ హైదరాబాద్‌కు మరో ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.