Antarctica Job Offer: 6 నెలల పనికి 1.3 కోట్ల ఆఫర్.. వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్న ఉద్యోగి

Employee Seeks Advice on 13 Crore Antarctica Job Offer
  • అంటార్కిటికాలో పరిశోధన కోసం ఉద్యోగికి బంపర్ ఆఫర్
  • తిండి సహా ఇతరత్రా సౌకర్యాలన్నీ అమర్చనున్న కంపెనీ
  • గర్ల్ ఫ్రెండ్ ను వదిలి ఉండాల్సి వస్తుందని తటపటాయిస్తున్న ఉద్యోగి
ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల సంగతి అందరికీ తెలిసిందే. రిటైరయ్యే వయసు వచ్చే వరకూ పనిచేసినా కోటి రూపాయలు సంపాదించడం కష్టం.. అలాంటిది కేవలం ఆరు నెలలు పనిచేస్తే ఏకంగా 1.3 కోట్ల రూపాయలు ఇస్తామని కంపెనీ ఓ ఉద్యోగికి ఆఫర్ చేసింది. పైగా ఈ ఆరు నెలల కాలంలో తిండితో పాటు సర్వ సౌకర్యాలు అమర్చుతామని పేర్కొంది. అంటే.. ఆరు నెలలు రూపాయి ఖర్చులేకుండా ఆ మొత్తం చేతికందుతుంది. ఇలాంటి ఆఫర్ ఇస్తే ఏ ఉద్యోగి అయినా ఎగిరిగంతేస్తాడు. ఆరు నెలలు కష్టపడితే ఆ తర్వాత సుఖపడవచ్చని భావిస్తాడు.

అమెరికాకు చెందిన ఎన్విరాన్ మెంటల్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి మాత్రం ఈ ఆఫర్ ను అంగీకరించాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి యూజర్ల సలహా కోరాడు.
రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. అంటార్కిటికాలోని మెక్ ముర్దో స్టేషన్ లో ఆరు నెలల పరిశోధన కోసం కంపెనీ తనకు ఆఫర్ ఇచ్చిందని చెప్పాడు. ఈ ఆరు నెలలకు 145 వేల డాలర్లు (సుమారు రూ.1.3 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించిందని, మిగతా ఖర్చులు కూడా కంపెనీయే భరిస్తుందని వివరించాడు.

అయితే, గత మూడేళ్లుగా తను, తన గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉంటున్నామని, ఇప్పుడు ఈ ఆఫర్ ను అంగీకరిస్తే తన గర్ల్ ఫ్రెండ్ ను వదిలి ఉండాల్సి వస్తుందని చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ ఆఫర్ ఒప్పుకోమనే చెబుతోంది కానీ తనే ఎటూ తేల్చుకోలేకపోతున్నానని వివరించాడు. సదరు ఉద్యోగి డైలామాపై నెటిజన్లు స్పందిస్తూ.. వెంటనే ఆ ఆఫర్ ను ఒప్పుకుని అంటార్కిటికా వెళ్లిపోమని సలహా ఇస్తున్నారు. ఆరు నెలలు ఇట్టే గడిచిపోతాయని, ఇంత మంచి ఆఫర్ మళ్లీ మళ్లీ రాకపోవచ్చని సూచిస్తున్నారు.
Antarctica Job Offer
McMurdo Station
Environmental Company
High Paying Job
Job Dilemma
Reddit
Girlfriend
Career Advice
Remote Work
Research Job

More Telugu News