సిక్ లీవ్ అడిగితే మేనేజర్ వేధింపులు.. ఉద్యోగి పోస్ట్‌తో దుమారం
- సిక్ లీవ్‌పై మేనేజర్ కఠిన నిబంధనలపై ఉద్యోగి ఆవేదన
- రెడిట్‌లో తన గోడు వెళ్లబోసుకున్న ఓ ఎంఎన్‌సీ ఉద్యోగి
- ఒకే రోజు ఇద్దరికి లీవ్ ఇవ్వనంటున్న అధికారి
- జ్వరంతో బాధపడుతున్నా పనిచేయాలంటూ తీవ్ర ఒత్తిడి
- ఇలాంటి కంపెనీల పేర్లు బయటపెట్టాలంటున్న నెటిజన్లు
ఓ మల్టీనేషనల్ కంపెనీ (ఎంఎన్‌సీ)లో పనిచేస్తున్న ఉద్యోగి.. తన మేనేజర్ సిక్ లీవ్ విషయంలో అనుసరిస్తున్న కఠిన నిబంధనల గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్నా సెలవు మంజూరు చేయకుండా వేధిస్తున్నారని ఆ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కార్పొరేట్ సంస్థల్లో పని వాతావరణంపై మరోసారి చర్చను రేకెత్తించింది.
"నా సిక్ లీవ్‌పై మా మేనేజర్ ప్రశ్నలు – సలహా కావాలి" అని 'ఇండియన్ వర్క్‌ప్లేస్' అనే రెడిట్ గ్రూప్‌లో బాధితుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. తన టీమ్‌లో ఒకే రోజు ఇద్దరు ఉద్యోగులు సెలవు తీసుకోవడానికి మేనేజర్ అంగీకరించరని, సిక్ లీవ్ అడిగితే చాలాసార్లు తిరస్కరిస్తారని వాపోయారు. "సెలవు కావాలంటే ఆమెను బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి" అని పేర్కొన్నారు. గతంలో ఓ ఉద్యోగి తండ్రి ఐసీయూలో ఉన్నప్పుడు కూడా ఆమె లీవ్ ఇవ్వలేదని గుర్తుచేశారు.
అంతేకాకుండా, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ నెలల్లో ఎలాంటి సెలవులు ఇవ్వరని, కానీ అదే మేనేజర్ డిసెంబర్‌లో సెలవుపై వెళ్తారని ఆరోపించారు. కంపెనీ నిబంధనల ప్రకారం తన పెయిడ్ లీవ్స్ అన్నీ ఈ ఏడాది డిసెంబర్ మొదటివారంలోనే వాడేశానని, ఇప్పుడు తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నానని తెలిపారు. అయినా కూడా "వ్యాపారం గురించి ఆలోచించడం లేదంటూ" తన మేనేజర్ పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చాలామంది ఉద్యోగికి మద్దతుగా నిలిచారు. "ఇలాంటి పని ప్రదేశాల గురించి తెలియాలంటే కంపెనీల పేర్లను బయటపెట్టాలి" అని ఒకరు సూచించగా, "సిస్టమ్‌లో లీవ్ అప్లై చేసి, ఆమెకు సమాచారం ఇచ్చి, ఆ తర్వాత ఆమెను పట్టించుకోవద్దు" అని మరొకరు సలహా ఇచ్చారు. "శరీరం సహకరించనప్పుడు ఎలా పని చేయగలరు? సెలవులు మీ హక్కు" అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.