Sheikh Aamer: సైబరాబాద్ నుంచి రౌడీషీటర్ బహిష్కరణ

Sheikh Aamer Exiled from Cyberabad for 6 Months
  • షేక్ ఆమేర్‌ ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు
  • హత్య, కిడ్నాప్ సహా 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆమేర్
  • ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు తీసుకున్నామన్న పోలీసులు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ఓ పాత నేరస్థుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడైన రౌడీ షీటర్ షేక్ ఆమేర్ (26)ను ఆరు నెలల పాటు సైబరాబాద్ కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్తాపూర్ పోలీసుల ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

జల్పల్లి షాహీన్‌నగర్‌కు చెందిన షేక్ ఆమేర్ ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడిలో నివాసం ఉంటున్నాడు. అతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. హత్య, కిడ్నాప్, మారణాయుధాలు కలిగి ఉండటం వంటి తీవ్రమైన నేరాల్లో ఇతను నిందితుడు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో బహిష్కరణ వేటు వేశారు. అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు ఈ బహిష్కరణ ఉత్తర్వులను షేక్ ఆమేర్‌కు అందజేశారు. బహిష్కరణ కాలంలో అతను ఎక్కడ నివసిస్తున్నాడో సమీప పోలీస్ స్టేషన్ ద్వారా అత్తాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం కోసమే ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Sheikh Aamer
Cyberabad
Rowdy Sheeter
Hyderabad Police
Avinash Mohanty
Attapur Police Station
Crime
বহিष्करण
Telangana Police
Law and Order

More Telugu News