TDP: తెలంగాణలో ఆ రెండు గ్రామాల్లో టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపు

TDP Supported Candidates Win in Two Telangana Villages
  • ఖమ్మం జిల్లాలోని పెద్దగోపతి గ్రామంలో టీడీపీ బలపరిచిన సునీత విజయం
  • మధిర మండలం అల్లిపురంలోనూ టీడీపీ మద్దతుదారు కృష్ణకుమారి గెలుపు
  • జడ్చర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని కొణిజెర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. పెద్దగోపతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి సునీత 1,258 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అదేవిధంగా, మధిర మండలం అల్లినగరం గ్రామంలో ఆవుల కృష్ణ కుమారి 89 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు కావడం విశేషం.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి రేవతి 31 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి అంజలికి 459 ఓట్లు రాగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేవతికి 490 ఓట్లు లభించాయి. తొలుత రేవతి ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించగా, ప్రత్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లో రేవతి మెజార్టీ 31 ఓట్లకు పెరిగింది.
TDP
Telugu Desam Party
Telangana Gram Panchayat Elections
Khammam
Konijerla

More Telugu News