TTD Chairman BR Naidu: స్థానిక భక్తులకు ఈ-డిప్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనం... టీటీడీ ప్రకటన

TTD Announces e Dip for Local Devotees Vaikunta Dwara Darshan
  • డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ
  • జనవరి 6, 7, 8 తేదీల కోసం రోజుకు 5,000 టోకెన్ల కేటాయింపు
  • తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి వాసులకు ప్రత్యేక కోటా
  • డిసెంబర్ 31న లాటరీ పద్ధతిలో టోకెన్ల కేటాయింపు
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురుచూస్తున్న తిరుపతి, తిరుమల స్థానిక భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. స్థానికుల కోసం ప్రత్యేక కోటా కింద ఈ-డిప్ (ఎలక్ట్రానిక్ డిప్) విధానంలో దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

జనవరి 6, 7, 8 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 5,000 చొప్పున టోకెన్లు కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ టోకెన్ల కోసం డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న భక్తులకు డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ పద్ధతిలో టోకెన్లను కేటాయిస్తారు.

కేటాయించిన 5,000 టోకెన్లలో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల స్థానికులకు 4,500, తిరుమలలో నివసించే స్థానిక భక్తులకు 500 టోకెన్లు రిజర్వ్ చేశారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా 1+3 విధానంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని స్థానిక భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.
TTD Chairman BR Naidu
TTD
Tirumala
Vaikunta Dwara Darshan
e-Dip
Tirupati
Local Devotees
Token
Online Registration
Lottery

More Telugu News