హైడ్రొజన్‌తో నడిచే 'మిరాయ్' కారులో పార్లమెంటుకు వచ్చిన కేంద్ర మంత్రి

  • స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
  • హైడ్రొజన్ వాడకంపై ఫీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా మిరాయ్‌లో వచ్చిన కేంద్ర మంత్రి
  • దేశంలో స్వచ్ఛమైన ఇంధన పరివర్తనకు ముందడుగు అన్న ప్రహ్లాద్ జోషి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 'మిరాయ్' కారులో పార్లమెంటుకు విచ్చేశారు. హైడ్రోజన్‌తో నడిచే ఈ వాహనాన్ని టయోటా సంస్థ అభివృద్ధి చేసింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా టయోటా కిర్లోస్కర్ మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ మధ్య నేడు ఒక ఒప్పందం కుదిరినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా 'మిరాయ్' కారును నడుపుతూ పార్లమెంటుకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎనర్జీ మిషన్‌లో హైడ్రొజన్ వినియోగం ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. మొబిలిటీ రంగంలో హైడ్రొజన్ వాడకంపై ఫీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా ఆయన మిరాయ్‌లో వచ్చారు.

టయోటా మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ మధ్య జరిగిన ఒప్పందం దేశంలో స్వచ్ఛమైన ఇంధన పరివర్తనకు ఒక ముందడుగు అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. ఇటువంటి భాగస్వామ్యాలు ఇంధన ఆత్మనిర్భరతను బలోపేతం చేస్తాయని, తక్కువ ఉద్గారాల రవాణాను ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు.


More Telugu News