Pakistan: పాకిస్థాన్‌పై అమెరికా మరోసారి ప్రేమ.. 686 మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందానికి ఆమోదం
- పాకిస్థాన్ F-16 జెట్ల ఆధునికీకరణకు అమెరికా ఆమోదం
- ఈ ఒప్పందంతో పాక్‌కు పెరగనున్న సైనిక సామర్థ్యం
- పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్
పాకిస్థాన్‌కు భారీ సైనిక సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. పాక్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణ కోసం సుమారు 686 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 5,700 కోట్లు) విలువైన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీ, విడిభాగాలు, శిక్షణ వంటివి అందించనుంది. అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (DSCA) యూఎస్ కాంగ్రెస్‌కు పంపిన లేఖను ఉటంకిస్తూ 'డాన్' పత్రిక ఈ వివరాలను వెల్లడించింది.
ఈ ప్యాకేజీలో లింక్-16 వ్యవస్థలు, క్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, ఏవియానిక్స్ అప్‌డేట్స్, సమగ్ర లాజిస్టికల్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ప్రతిపాదనపై యూఎస్ కాంగ్రెస్‌లో 30 రోజుల పాటు సమీక్ష జరగనుంది. ఈ కీలక పరిణామాలను భారత్ చాలా నిశితంగా గమనిస్తోంది. F-16 విమానాలను తయారు చేసే టెక్సాస్‌కు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఈ ప్రాజెక్టుకు ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించనుంది.
పాకిస్థాన్ F-16 విమానాల నిర్వహణ, కార్యాచరణ భద్రతను మెరుగుపరచడానికే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదని, తమ రక్షణ సన్నద్ధతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని తన లేఖలో పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికా, మిత్రపక్షాలతో కలిసి పనిచేసేందుకు పాకిస్థాన్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఆధునికీకరణతో F-16 విమానాల జీవితకాలం 2040 వరకు పెరుగుతుందని వివరించింది. 2021లోనే పాకిస్థాన్ ఈ అప్‌గ్రేడ్‌ల కోసం అభ్యర్థించినప్పటికీ, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా స్పందించలేదు. ఇప్పుడు ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.