Hyderabad car fire: హైదరాబాద్‌లో ఒకేచోట నాలుగు కార్లు దగ్ధం

Hyderabad Four Cars Gutted in Fire Accident
  • రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో దగ్ధమైన కార్లు
  • ప్రమాదంలో పాక్షికంగా కాలిపోయిన కారు, ట్రాలీ 
  • మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం
హైదరాబాద్‌ నగరంలో ఒకే చోట నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహ్మత్ నగర్ డివిజన్, ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో కారు, ఒక ట్రాలీ ఆటో పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సమీపంలోని నివాసాల వారు ఈ మైదానంలో కార్లను పార్కింగ్ చేస్తుంటారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఎస్ఆర్ నగర్ ఏసీపీ, బోరబండ ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Hyderabad car fire
Hyderabad
Jubilee Hills
Rahmat Nagar
SPR Hills
Car fire accident

More Telugu News