Arunachal Pradesh: అరుణాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది కార్మికులు దుర్మరణం

17 feared dead after truck falls into gorge near India China border in Arunachal
  • 21 మంది కూలీలతో వెళుతున్న ట్రక్కు లోయలో పడిపోయిన‌ వైనం
  • ఈ ఘటనలో 17 మంది మృతి చెందినట్లు అనుమానం
  • సోమవారం జరిగిన ప్రమాదం గురువారం వెలుగులోకి 
  • గాయపడిన ఓ కార్మికుడు సమాచారం ఇవ్వడంతో ఘటన బహిర్గతం
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 21 మంది కార్మికులతో వెళుతున్న ఓ ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంజావ్ జిల్లాలోని హయులియాంగ్-చగ్లాగం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళితే... ఈ ప్రమాదం వాస్తవానికి సోమవారం జరగ్గా, మూడు రోజుల తర్వాత ఈరోజు వెలుగులోకి వచ్చింది. ట్రక్కుతో పాటు లోయలో పడిపోయిన వారిలో ప్రాణాలతో బయటపడిన ఓ కార్మికుడు, తీవ్ర గాయాలతో సమీపంలోని పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషాద ఘటన గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది.

ఈ విషయాన్ని అంజావ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మిల్లో కోజిన్ ధృవీకరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం అంతర్జాతీయ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉందని ఆయన తెలిపారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలపై దృష్టి సారించారు. 
Arunachal Pradesh
Arunachal Pradesh Road Accident
Road Accident
India China Border
Anjaw District
Hayuliang-Chaglagam Road
Millo Kojin
Accident
Workers

More Telugu News