Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Silver Prices Increased Again
  • వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్ రిజర్వ్
  • భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి
  • ఉదయం స్వల్పంగా తగ్గి, ఫెడ్ నిర్ణయం తర్వాత పెరిగిన ధరలు
బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ విలువైన లోహాల ధరలు పెరిగాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్ 4,216 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ఔన్సు ధర 62 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,000 పైన ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,19,350 పలుకుతోంది. వెండి కిలో ధర రూ.1,95,400 మార్కును చేరుకుంది. గురువారం మార్కెట్ ప్రారంభంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు తర్వాత ధరలు కాస్త పెరిగాయి.
Gold Price
Gold
Silver Price
Silver
Hyderabad Gold Rate
Commodity Market
US Fed Rate

More Telugu News