పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలా?... ముందు ఈ పని పూర్తి చేయండి!
- ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన
- పీఎఫ్ సేవలు పొందేందుకు యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భవిష్య నిధి సంస్థ
- ఆన్లైన్లో ఆరు సులభమైన స్టెప్స్‌తో యాక్టివేషన్ పూర్తి
ఈ మేరకు ఈపీఎఫ్ఓ తమ అధికారిక సోషల్ మీడియా 'ఎక్స్' ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది. "ఈపీఎఫ్ సేవలు పొందాలంటే యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి" అని పేర్కొంటూ, చందాదారులు తమ నంబర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఆరు సులభమైన స్టెప్స్‌లో వివరించింది. పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు పొందవచ్చని సూచించింది.
యూఏఎన్ యాక్టివేట్ చేసుకునే విధానం..
- ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
- 'Important Links' విభాగంలో కనిపించే 'Activate UAN' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తెరపై కనిపించే పేజీలో యూఏఎన్, ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత 'Get Authorization Pin'పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేసి, 'Submit' బటన్‌ను నొక్కితే మీ యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది.
యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత చందాదారులు epfindia.gov.in వెబ్సైట్ ద్వారా అన్ని రకాల ఆన్లైన్ సేవలను సులభంగా పొందవచ్చు.