Chandrababu Naidu: 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu unveils 87th National Badminton Championship poster
  • ఈ నెల 24 నుంచి విజయవాడలో జరగనున్న పోటీలు
  • పదేళ్ల తర్వాత ఏపీకి దక్కిన ఆతిథ్య అవకాశం
  • టోర్నీ ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించిన క్రీడామంత్రి
విజయవాడ వేదికగా జరగనున్న యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు సీఎంను కలిసి టోర్నమెంట్ వివరాలు అందించారు.
 
ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. పదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి సీఎంకు వివరించారు. టోర్నమెంట్ నిర్వహణకు క్రీడా శాఖ, పురపాలక శాఖ, శాప్ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు.
 
ఈ పోటీల్లో పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలను, నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, టోర్నమెంట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
National Badminton Championship
AP Badminton
Yonex Sunrise Badminton
Vijayawada
Mandi Palli Ram Prasad Reddy
SAP Ravi Naidu
Badminton Association of Andhra Pradesh

More Telugu News