ఓటీటీలో 'ఘటన' .. అవసరాలు మార్చే అవతారాలు!

  • లఘుచిత్రాల వేదికగా 'కథాసుధ'
  • ఈ నెల నుంచి 'ఘటన' స్ట్రీమింగ్ 
  • మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ
  • ఆలోచింపజేసే కంటెంట్
 'ఈటీవీ విన్'లో ప్రతివారం 'కథాసుధ' శీర్షిక క్రింద లఘుచిత్రాలను అందిస్తూ వస్తున్నారు. అరగంటలోపు నిడివి కలిగిన ఈ లఘుచిత్రాలు (మైక్రో డ్రామా) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ గా అనిపించే కథాకథనాలతో రూపొందుతున్న ఈ లఘు చిత్రాలు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. అలా ఈ నెల 7వ తేదీన అందుబాటులోకి వచ్చిన కంటెంట్ గా 'ఘటన' కనిపిస్తుంది. రావణ్ రెడ్డి .. గడ్డం శ్రీనివాస్ .. చాందినీరావు నటించగా, కొత్తపల్లి సురేశ్ దర్శక నిర్మాతగా వ్యవహరించాడు.    

నాణానికి బొమ్మ - బొరుసు మాదిరిగా, మంచి - చెడు ప్రతి మానిషిలోనూ ఉంటాయి. మనం ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించే తీరును బట్టి, ఎదుటివారు మనతో మసలుకునే విధానం ఉంటుంది. ఎవరినీ కూడా పూర్తి మంచివాడు .. పూర్తిగా చెడ్డవాడు అని చెప్పలేము. పరిస్థితులు .. సందర్భాలు వ్యక్తులను .. వారి స్వభావాలను ప్రభావితం చేస్తూ ఉంటాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన లఘుచిత్రం ఇది. 

మనకి ఏం తెలుసు? ఎంత తెలుసు? అనే దానికంటే కూడా, మనకి తెలిసిన విషయాన్ని అవతలివారికి అర్ధమయ్యేలా చెప్పగలిగినప్పుడే దాని అసలైన ప్రయోజనం నెరవేరుతుంది. అలా చాలా సింపుల్ కంటెంట్ తీసుకుని అంతే సింపుల్ గా అర్థమయ్యేలా దర్శకుడు ఈ కథను ఆవిష్కరించాడు. మూడే మూడు పాత్రలతో చేసిన ఈ ప్రయత్నం ఆలోచింపజేసేలా ఉంటుంది. 




More Telugu News