Ro-Ko: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌, కోహ్లీల హ‌వా.. టాప్-5లో ముగ్గురు భార‌త క్రికెట‌ర్లు

Rohit Sharma and Virat Kohli Dominate ODI Rankings
  • నంబ‌ర్‌వ‌న్ ర్యాంకును నిల‌బెట్టుకున్న హిట్‌మ్యాన్
  • రెండు స్థానాలు ఎగ‌బాకి రెండో ర్యాంకుకు కోహ్లీ
  • ఐదో స్థానంలో భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ అనంతరం కెరీర్‌లో తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకు అందుకున్న రోహిత్ శర్మ.. తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం 302 పరుగులు సాధించాడు. సిరీస్ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీ రెండో ర్యాంకుకు ఎగబాకాడు.

ఇదే జాబితాలో భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో టాప్-5లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉండటం విశేషం. ఇది వన్డే ఫార్మాట్‌లో భారత బ్యాటింగ్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Ro-Ko
Rohit Sharma
Virat Kohli
Shubman Gill
ICC ODI Rankings
Indian Cricket Team
ODI Cricket
Cricket Rankings
India vs South Africa
Australia
Cricket

More Telugu News