ఈ మహత్తర కార్యాచరణలో నా దిశా నిర్దేశం కోరడం ఆనందదాయకం: చిరంజీవి

  • సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతను కొనియాడిన మెగాస్టార్ చిరంజీవి
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న చిరు
  • హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ హబ్‌గా మార్చడం గొప్ప లక్ష్యం
  • ప్రభుత్వ ప్రోత్సాహంతో వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులు వస్తాయని ఆశాభావం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యం అద్భుతమని ఆయన కొనియాడారు. మంగళవారం ఫ్యూచర్ సిటీలో జరిగిన "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్"లో పాల్గొన్న చిరంజీవి... నేడు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సదస్సుకు తనను అతిథిగా ఆహ్వానించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. 'తెలంగాణ రైజింగ్ - 2047 విజన్'లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఈ బృహత్తర కార్యాచరణలో తన దిశానిర్దేశం కోరడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి విజన్, ప్రభుత్వ ప్రోత్సాహంతో మన తెలుగు పరిశ్రమ నుంచి మరెన్నో వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటాయని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రపంచ సినిమా హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తుందని ఆయన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.


More Telugu News