సికింద్రాబాద్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
- సికింద్రాబాద్ లాడ్జిలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు గుర్తింపు
- సంగారెడ్డిలో అదృశ్యమైన బాలికను మాయమాటలతో లాడ్జికి తరలింపు
సికింద్రాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఓ లాడ్జిలో బాలికతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు 19 ఏళ్ల యువకులు కాగా, మరో ఇద్దరు 17 ఏళ్ల మైనర్లు ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఈ నెల 4వ తేదీన అదృశ్యమైంది. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లి, తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టి సారించారు. సిగ్నల్స్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి, వెంటనే అక్కడికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ నెల 8న సికింద్రాబాద్ బస్ స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన నిందితులు, ఆమెకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.